మాల కులం పేరు - దాని అర్ధం

మాల కులం పేరు - దాని అర్ధం

Information

మాల అంటే కులం కాదు.. మాల అనేది ఒక ప్రత్యేక జాతి.

జర్మన్ చరిత్రకారులు Gustav Solomon Oppert‌ గారి అధ్యాయనం ప్రకారం,,  ద్రవిడ సంస్కృతి, ద్రవిడ చరిత్ర "మాల" అనే పేరుతో పెనవేసుకుని ఉన్నట్లు, తన పరిశోధనా గ్రంథం The Original Inhabitants of Bharata Varsha or India - The Dravidians (భారత దేశ అసలైన భూమి పుత్రులు - ద్రవిడులు) లో పేర్కొన్నారు.

పర్వత ప్రాంతం (హిమాలయాలు -సింధు లోయ - సింధు నాగరికత) నుండి వచ్చినవారిగా చెప్పబడే "మాలవ" అనే ఈ Proto-Dravidian జాతి ప్రజలను, భారత దేశం అంతటా, పర్వతానికి పర్యాయపదాలైన పేర్లతో పిలవబడ్డారు అని రాశారు.

ఆ విధంగా,, "మాల" అనే పేరు పర్వతానికి పర్యాయపదం అయిన "మలై" అనే పేరు నుండి వచ్చింది.. వీరినే మల్లార్/పరయా (పర్వత నుండి పరయా) అని, గంగా పరివాహిక ప్రాంతంలో మల్లలు అని,, బెంగాల్ ప్రాంతంలో మాల్ లు అని,, మేరు పర్వతం పేరుతో పడమరలో, మార్లు అని, మహార్లు అని,, భార్ లు అని పిలిచినట్టు,, వీరే ద్రవిడ సాంస్కృతికి మూలాల అని Gustav Oppert పేర్కొన్నారు.

తమిళ సంగం సాహిత్యంలో కూడా వీరు శివుడి కుమారుడు మాల చెన్నప్ప వారసులు అని, వీరు కైలాస పర్వత నివాసులు కాబట్టి వీరికి పర్వతానికి తమిళ పదం "మలై" అనే పేరుతో "మాల" అనే పేరు వచ్చిందని చెప్పబడింది.. "నాగ" అనే జాతి పదానికి సంబంధించిన మూలాల శైవంలో ఎక్కువగా కనిపిస్తాయి.

మాలలు తమను తాము రెండు తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేసుకుని చూడకూడదు .

  • తమిళమాలలు :–పరయాలు
  • కన్నడ మాలలు :–హోలియాలు
  • కేరళ మాలలు :–పులయార్లు
  • మహారాష్ట్ర మాలలు:–మహర్లు

జనాభా మొత్తం కలుపుకుంటే ,, దక్షిణ భారతదేశంలో 28 % తో ,, అత్యంత జనాభా కలిగిన Single Caste మాలలు మాత్రమే .. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీన జాతి మాలలు .. దక్షిణ భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది కూడా మాలలే.

మాల జాతి సాధించిన విజయాలకు - ఉదాహరణ:

మహారాష్ట్ర –మహర్ లు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్–భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, విశ్వ జ్ఞాని, సామాజిక విప్లవ యోధుడు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ వ్యవస్థాపకులు.
  • బాబు L. N హరదాస్ గారు - జై భీమ్ అనే నినాదాన్ని మనకు అందించి, బాబాసాహెబ్ ఉద్యమాన్ని ఇంటింటికి పరిచయం చేసిన ధృవతార.
  • కాశబా జాధవ్ " గారు– మల్ల యుద్ధ వీరుడు 1952 ఒలింపిక్స్ పథకం"స్వతంత్ర భారత దేశానికి మొట్ట మొదటి ఒలంపీక్ వ్యక్తిగత పధకం సాధించినవారు.

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మాలలు

  • కన్నమదాసు-అతి వీర భయంకర కత్తి యుద్ధ వీరుడు శత్రుసైన్యం లక్షమంది ఉన్న గడగడలాడించే ధీరత్వం ఆయన సొంతం.
  • ఓబలమ్మ- రోకలిని ఆయుధంగా చేసి హైదర్ అలీ సైనికుల నుంచి చిత్రదుర్గ కోటను కాపాడిన వీర వనిత.
  • దామోదరం సంజీవయ్య - భారతదేశ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి , ఆంద్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి.
  • భాగ్యరెడ్డి వర్మ - మొట్టమొదటి ఆది - ద్రవిడ ఉద్యమకర్త.
  • బత్తుల వెంకట్రావు - నిజాం ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి - మొదటి Social Welfare సిద్ధాంతకర్త.
  • కుసుమ ధర్మన్న - దక్షిణ భారతదేశంలో మొదటి దళిత విప్లవ కవి.
  • సర్దార్ నాగప్ప - రాజ్యాంగ పరిషత్తులో మాల నాయకులు - మొదటి దళిత MLA (కర్నూలు నియోజకవర్గం).. రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు మించి కొనసాగడానికి మూమేకతోటి సూచరిత - ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా హోమ్ మంత్రకారణం.
  • బోయి భీమన్న - పద్మ విభూషన్ ,, అది ద్రవిడ సిద్ధాంత రచయిత.
  • కత్తి పద్మారావు - దేశంలో దళిత ఉద్యమాలను కొత్త పుంతలు తొక్కించిన నాయకులు.
  • బొజ్జా తారకం - ప్రఖ్యాత సామాజిక హక్కుల ఉద్యమకారులు.
  • జెట్టి ఈశ్వరీ బాయి - బాబాసాహెబ్ రిపబ్లికన్ పార్టీ మొదటి అధ్యక్షురాలు , రిపబ్లికన్ పార్టీ నుండి మొదటి మహిళా MLA.
  • GMC బాలయోగి - భారత పార్లమెంటుకు మొట్టమొదటి దళిత స్పీకర్.
  • ప్రతిభా భారతి - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొట్టమొదటి మహిళా స్పీకర్.
  • మేకతోటి సూచరిత - ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా హోమ్ మంత్రి.
  • లంకపల్లి బుల్లయ్య - భారతదేశంలోని యూనివర్సిటీలలో మొట్టమొదటి దళిత వైస్ ఛాన్సలర్.
  • గడ్డం వెంకటస్వామి - కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షులు ,, నవభారత కార్మిక ఉద్యమ నిర్మాత, ప్రజల చేత కాకా అని ప్రేమగా , పిలిపించుకున్న నేత.
  • జలాది రాజారావు - తెలుగు సినిమా గేయకర్త
  • గోరేటి వెంకన్న - విప్లవ రచయిత , ఉద్యమాలను ఊపు ఊపే గాయకులు
  • గద్దర్–ప్రజా విప్లవ గాయకుడు  ఉద్యమాలను ఊపు ఊపే గాయకులు
  • కాలేకురి ప్రసాద్–దిక్కార కవి సినీ గేయ రచయిత సమత విప్లవ రచయిత
  • అర్చన - రెండు సార్లు జాతీయ పురస్కారాలు పొందిన సినిమా నటి
  • మాధవి - జాతీయ ఉత్తమ నటి పురస్కారం పొందిన సినిమా నటి
  • జానీ లివర్ - బాలీవుడ్ కి హాస్యాన్ని నేర్పిన నటులు

ఉత్తర్ ప్రదేశ్ మాల– కోలీ(కోరి), మల్లహ్

  • ఝల్కారీబాయి కోరి–1857 సిపాయిల తిరుగుబాటు లో బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేసిన వీరవనిత.... చిన్నప్పుడే కర్ర సాము, కత్తి సాము, గుర్రపు స్వారీ లాంటి యుద్ధ విద్యలు నేర్చుకుని.  ఒంటి చేత్తో చిరుతపులిని చంపడం, బందిపోటు దొంగల్ని తరిమి కొట్టడంతో  వీరనారిగా పేరుతెచ్చుకుంది.

కేరళ మాల- పులియ కులం

  • అయ్యంకాలి - పులియ - మొదటి కేరళ ఉద్యమకర్త
  • P.K. రోసి - పులియ - మొదటి కేరళ హీరోయిన్
  • KR. నారాయణన్- భారతదేశానికి 10వ రాష్ట్రపతి
  • KG బాలకృష్ణన్- 35వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
  • తమిళమాల -పరయాలు
    అయోతి దాస్ - మొదటి బౌద్ధ ఉద్యమకారులు
  • MC రాజా - దక్షిణ భారతదేశం నుండి మొదటి శాసన సభ్యులు , షెడ్యూల్డ్ caste ఫెడరేషన్ బాబాసాహెబ్ కి అప్పగించిన నాయకులు
  • వేలుపిళ్ళై ప్రభాకరన్ - శ్రీలంక LTTE వ్యవస్థాపకుడు
  • తిరుమవలవన్ - దళిత చిరుత , విప్లవ చిరుతల కచ్చి ( VCK ) పార్టీ వ్యవస్థాపకులు
  • ఇళయరాజా - భారతీయ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన విద్వాంసులు
  • రజనీకాంత్ - మహారాష్ట్ర మహార్ కులస్తులు.. సూపర్ స్టార్
  • ప్రభుదేవా - నృత్య రంగంలో భారతదేశానికి వన్నె తెచ్చిన లెజెండ్
  • చియా విక్రమ్ - అపరిచితుడు సినిమాతో ప్రపంచ స్థాయి ఆదరణ పొందిన నటులు
  • విజయ్ జోసఫ్ - అత్యంత ప్రజాదరణ పొందిన తమిళ నటులు
  • ధనుష్ - తమిళ సినిమాని ప్రపంచ స్థాయికి నిలబెట్టిన నటులు
  • పా .రంజిత్ - నీలి విప్లవ దర్శకులు
  • యువన్ శంకర్ రాజా - ప్రఖ్యాత సంగీత దర్శకులు
  • లారెన్స్ రాఘవేంద్ర - నటులు , దర్శకులు

వీరుతో పాటు జాతిపరంగా సోదరులు అయిన మహారాష్ట్ర మహార్లను, ఉత్తర్ ప్రదేశ్ కోలీలను  మల్లలను, మధ్య ప్రదేశ్ కోరీ, బెంగాల్ మల్ - పహాడియా లను కలుపుకుంటే ఈ దేశంలో అత్యంత జనాభా కలిగిన జాతి మాల జాతి. 297 జిల్లాల్లో విస్తరించి ఉన్న కులం - మాల కులం